ఇక హిందీలోనూ ..ఆకాశమే నీ హద్దురా..!

ఇక హిందీలోనూ ..ఆకాశమే నీ హద్దురా..!

3 days ago | 10 Views

మహిళా దర్శకుల్లో సుధా కొంగరకు  ప్రత్యేక శైలి ఉంది. ఆమె ఎంచుకునే కథలు, తెరకెక్కించే తీరు విభిన్నం. అందుకు ఆమె తెరకెక్కించిన చిత్రాలే నిదర్శనం. ప్రస్తుతం ఆమె 'సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ’ఆకాశం నీ హద్దురా’కు రీమేక్‌గా తెరకెక్కింది. జులై 12న విడుదలకానుంది. అయితే ఈ చిత్రం తర్వాత పైప్‌లైన్లో  ఏ చిత్రం ఉందనే విషయాన్ని సుధా ఇప్పటిదాకా వెల్లడించలేదు.  సూర్యతో ’పురాణనూరు’ అనే చిత్రం చేయనున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

Review: Aakasam Nee Haddura

అయితే ఆ చిత్రం ఆగిపోయిందనే టాక్‌ కూడా నడుస్తోంది. కోలీవుడ్‌ విూడియా వార్తల ప్రకారం సుధా తదుపరి చిత్రం ధనుష్‌తో  ఉంటుందని టాక్‌. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు, చర్చలు మొదలైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. సూర్యతో చేయాల్సిన కథనే ధనుష్‌తో చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'సర్ఫిరా' విడుదల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ధనుష్‌ ప్రస్తుతం 'రాయన్‌’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్థమవుతున్నారు. అలాగే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇంకా చదవండి: ఆగష్టు 15న రానున్న 'తంగలాన్‌'

# AakaasamNeeHaddhuRa     # Suriya     # AparnaBalamurali     # TeluguCinema