ఘనంగా ఆనంద్ దేవరకొండ

ఘనంగా ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" ట్రైలర్ లాంఛ్

1 month ago | 19 Views

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - బేబి సినిమా ట్రైలర్ ను ఇక్కడే విడుదల చేశాం. అది జూలై నెల అప్పుడు వర్షం పడింది. ఇప్పుడు మే నెల. ఈ రోజు కూడా వర్షం పడింది. బేబి లాంటి సక్సెస్ గం గం గణేశాతో ఆనంద్ కు దక్కాలని కోరుకుంటున్నా. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి వచ్చాడు తనకు హీరోగా చేయడం ఈజీ అని అనుకుంటారు. కానీ ఆ బ్యాగేజ్ మోయడం ఆనంద్ కు కష్టం. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం చూశాక కుర్రాడు ఫర్వాలేదు అనుకున్నారు. కానీ సాయి రాజేశ్ చేసిన బేబితో ఆనంద్ కు బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ సినిమాలో ఆనంద్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ రెండు సీన్స్ లో సూపర్బ్ అనిపించాడు. ఆనంద్, విజయ్ ఇద్దరూ వేర్వేరు దారుల్లో పయణిస్తున్నారు. మే 31న ఆనంద్ కు, మొత్తం టీమ్ కు గం గం గణేశా సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ - గం గం గణేశాతో ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. మాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా టీజర్ మీకు ఎలా నచ్చిందో ట్రైలర్ కూడా అలాగే ఇంప్రెస్ చేస్తుంది. గం గం గణేశా సాంగ్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. యాక్షన్ పార్ట్ లో ఆనంద్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ నెల 31న గం గం గణేశా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నిర్మాత కేదార్ సెలగంశెట్టి మాట్లాడుతూ - ఈ కార్యక్రమానికి వచ్చిన ఆనంద్ ఫ్యాన్స్ కు హాయ్ . మా సంస్థలో ఆనంద్ తో గతంలోనే సినిమా చేయాల్సింది. ఇప్పుడు తను స్టార్ అయ్యాక మూవీ చేస్తుండటం హ్యాపీగా ఉంది. గం గం గణేశాతో మంచి సక్సెస్ అందుకోబోతున్నాం. ఒక మంచి మూవీ మా సంస్థకు ఇచ్చిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఎన్నికలు పూర్తయ్యాయి, ఐపీఎల్ చివరకు వస్తోంది, ఎండలు తగ్గి వర్షాలు పడుతున్నాయి. మూతపడిన కొన్ని సింగిల్ స్క్రీన్స్ మళ్లీ తెలుస్తున్నారు. ఇలాంటి రైట్ టైమ్ లో మా గం గం గణేశా మూవీ రిలీజ్ కు వస్తోంది. ఏ బిజినెస్ అయినా రైట్ టైమ్ లో చేయాలి. ఎలక్షన్స్ లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. మా మూవీ రిలీజ్ కు కూడా ఇది సరైన టైమ్ అనుకుంటున్నాం. ఈ నెల 31న గం గం గణేశాతో పాటు మిగతా సినిమాలు వస్తున్నాయి వాటికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. అయితే ఏ పని మొదలుపెట్టినా గణేశుడితో మొదలుపెడతారు. అలా బేబి తర్వాత ఆనంద్ ను చూసేందుకు గం గం గణేశా థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నటుడు యావర్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. గం గం గణేశాలో నాకు మంచి రోల్ దక్కింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆనంద్ ఎంతో సపోర్ట్ చేశాడు. ఆనంద్ కు థ్యాంక్స్ చెబుతున్నా. గం గం గణేశా ట్రైలర్ మీకు ఎలా నచ్చిందో సినిమా కూడా అలాగే మెప్పిస్తుంది. థియేటర్స్ కు వచ్చి మా మూవీ చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నటుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ - గం గం గణేశా సినిమా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఒక సెపరేట్ కామెడీ టైమింగ్ లో మూవీ వెళ్తుంటుంది. మీ లైఫ్ లో మీరు ఏది చేసినా సపోర్ట్ చేసే బెస్ట్ ఫ్రెండ్ ఒకరుంటారు. అలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్ నేను ఈ చిత్రంలో చేశాను. ఆనంద్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపిస్తా. నా క్యారెక్టర్ చూస్తే మీ ఫ్రెండ్ గుర్తుకువస్తాడు. ఈ సినిమాలో నాతో కలిపి ముగ్గురు హీరోయిన్స్. ఆనంద్ అన్నతో నా కెమిస్ట్రీ అలా ఉంటుంది. గం గం గణేశా చూసేందుకు థియేటర్స్ వెళ్లండి. మూవీ మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ - సినిమాలను క్లాస్ మాస్ అని విభజిస్తాం. కానీ మా మూవీ క్లాస్ మాస్ కలిపి ఉంటుంది. గణేశ్ చతుర్దిని అన్ని వర్గాల ప్రజలు ఎంత ఎనర్జిటిక్ గా జరుపుకుంటారో అంతే ఎనర్జి మా గం గం గణేశా మూవీలో ఉంటుంది. వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం. ఆద్యంతం సినిమా వినోదాత్మకంగా ఉంటూనే ట్విస్ట్ లు థ్రిల్ కలిగిస్తాయి. థియేటర్స్ లో గం గం గణేశాను చూస్తూ ఎంజాయ్ చేయండి. అన్నారు.

రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ఆనంద్ ఫ్యాన్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లో ఉన్న హుషారు కనిపిస్తోంది. బేబి సినిమాను రీసెంట్ గా చూశాను. ఆనంద్ నటన, సాయి రాజేశ్ రూపకల్పన ఎంతో ఆకట్టుకుంది. వారికి నా ఆశీస్సులు అందజేస్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ ఉదయ్ నా దగ్గర పనిచేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. గం గం గణేశ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. తెలంగాణలో 72 పర్సెంట్, ఏపీలో 81 పర్సెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సినిమాకు మాత్రం 100 పర్సెంట్ ప్రేక్షకులు ఓటేస్తారని ఆశిస్తున్నా.  వినాయకుడిని పూజించకుండా వెళ్తే విఘ్నాలు ఎదురవుతాయి. అబ్బాయిలు ఈ సినిమా చూడకుండా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే మీ చెంపలు పగులుతాయి. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ - మా ఈవెంట్ కు వచ్చిన విజయేంద్రప్రసాద్ గారు, వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్ గారికి థ్యాంక్స్. గం గం గణేశాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మూవీలో చాలా షేడ్స్ ఉంటాయి. స్పైసీ, స్వీట్, థ్రిల్, యాక్షన్ అన్ని అంశాలతో గం గం గణేశా ఆకట్టుకుంటుంది. ఆనంద్ క్యారెక్టర్ మీకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ నెల 31న గం గం గణేశా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - సినిమాకు ప్రాణం పెట్టే హీరో ఆనంద్ దేవరకొండ. ఆయనతో బేబి సినిమా రూపొందించి దర్శకుడిగా ఎంతో సంతృప్తి చెందాను. ఆనంద్ దర్శకుడిని నమ్మితే అతను ఎలా చెబితే అలా నటిస్తాడు. ఆనంద్ బేబి టైమ్ లో నాకు డ్యాన్స్ రాదు అన్నా అనేవాడు. ఈ సినిమాలో అతని డ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రియదర్శన్, క్రేజీ మోహన్ లాంటి మంచి కామెడీ టైమింగ్ దర్శకుడు ఉదయ్ లో ఉంది. అతను నాకు ఈ కథ చెప్పాడు. చెప్పినట్లే స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. ఉదయ్ కు మంచి ఫ్యూచర్ ఉంది. ఆనంద్ అన్నకు బేబి తర్వాత అలాంటి మంచి సక్సెస్ గం గం గణేశా ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - బేబి లాంటి మెమొరబుల్ మూవీని నాకు అందించిన దర్శకుడు సాయి రాజేశ్ అన్నకు థ్యాంక్స్. మా అన్నయ్య విజయ్ లోని యాక్టింగ్ టాలెంట్ ను మొదట గుర్తించింది విజయేంద్రప్రసాద్ గారు. అన్న స్టేజ్ ప్లేస్ చేస్తున్నప్పుడు నీలో టాలెంట్ ఉంది. నా సినిమాల్లో తీసుకుంటా అనేవారు. ఆయన ఇవాళ మా ఈవెంట్ కు వచ్చి బ్లెస్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటుంది. అతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సినిమా డైరెక్టర్స్ మీడియం. వారికే మొదట ప్రాధాన్యత దక్కాలి. నిన్న డైరెక్టర్స్ డే ఘనంగా జరుపుకున్నాం. డైరెక్టర్స్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా అభిమానులు మనమంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలో ఏ మంచి జరిగినా, ఎవరు ఏది అఛీవ్ చేసినా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇవాళ చిత్ర పరిశ్రమలో కాంపిటీషన్స్ నుంచి కంపారిజన్స్ వైపు వెళ్తున్నాం. ఎవరైనా పెద్దవాళ్లు ఏదైనా సాధిస్తే  కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి. అలా కాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్లు సాధించే విజయాలు సెలబ్రేట్ చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా రియలిస్టిక్, న్యాచురల్ మూవీస్ చేశాను. గం గం గణేశాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో వస్తున్నా. ఇది టిపికల్ జానర్ మూవీ. క్రైమ్ కామెడీ కథతో ఆకట్టుకుంటుంది. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, స్వామి రారా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. బేబి సినిమాతో దీన్ని పోల్చుకుని చూడకండి. గం గం గణేశా వేరే జానర్ మూవీ. మా డైరెక్టర్ ఉదయ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాడు. సాటివారికి సపోర్ట్ చేస్తాడు. ఆయనకు మరో రెండు మూడు సినిమాలు వెంటనే అవకాశాలు దక్కి బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. మా ప్రొడ్యూసర్స్ కు గం గం గణేశా డబ్బులు తీసుకురావాలి. థియేటర్స్ లో ఈ నెల 31న గం గం గణేశా చూసి బ్లెస్ చేయండి. అన్నారు.

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

లిరిక్స్ - సురేష్ బనిశెట్టి

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి

ఇంకా చదవండి: ఈ నెల 29న విజయ్ ఆంటోనీ "తుఫాన్" టీజర్ లాంఛ్

# Gamgamganesha     # Ananddevarakonda     # Pragatisrivastava    

trending

View More