ప్రతిష్టాత్మకంగా 'థగ్‌ లైఫ్‌' మూవీ!

ప్రతిష్టాత్మకంగా 'థగ్‌ లైఫ్‌' మూవీ!

1 month ago | 23 Views

కమల్‌హాసన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని తెలిసిందే. వీటిలో ఒకటి 'థగ్‌ లైఫ్‌’ మణిరత్నం డైరెక్షన్‌లో వస్తోంది. 'థగ్‌ లైఫ్‌'లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తుండగా.. గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఢిల్లీలోని  సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో కొనసాగుతున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. కమల్‌ హాసన్‌, శింబు  అండ్‌ టీంపై వచ్చే సీన్లను చిత్రీకరిస్తున్నారు. లొకేషన్‌లో కమల్‌ హాసన్‌ కోరవిూసంతో ఉన్న లుక్‌తో పాటు శింబు స్టైలిష్‌ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా 'థగ్‌లైఫ్‌' టీం మరో ఆసక్తికర అప్‌డేట్‌తో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త ఆరంభ సమయం.. కొత్త థగ్‌కు స్వాగతం పలికే సమయం.. రేపు ఉదయం 10 గంటలకు  అప్‌డేట్‌ రానుందంటూ ఓ వీడియో షేర్‌ చేశారు మేకర్స్‌. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 'థగ్‌ లైఫ్‌' టీంతో డిజైన్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ మూవీకి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని కమల్‌ హాసన్‌`ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్‌ జియాంట్‌ మూవీస్‌, మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌`ఆర్‌ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఇంకా చదవండి: నిఖిల్‌ సరసన సంయుక్త!

# ThugLife     # SilambarasanTR     # KamalHaasan     # TeluguCinema    

trending

View More