యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆలియాభట్, శార్వరి నటిస్తున్న ఆల్ఫా... క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్ 25న విడుదల!
2 months ago | 5 Views
యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆలియాభట్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు. ఆమెతో పాటు శార్వరి సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ హోమ్ గ్రోన్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు శార్వరి. ఆల్పాలో ఆలియా, శార్వరి ఇద్దరూ సూపర్ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్ లో రూపొందుతోంది ఆల్పా. శివ్ రావెల్ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందంటున్నారు మేకర్స్.
ఆల్ఫా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి పక్కా హాలిడే ట్రీట్ అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ స్పెక్టకిల్ అనే పదానికి సిసలైన అర్థం ఎలా ఉంటుందో చూపించనుందీ సినిమా. స్టన్నింగ్ విజువల్స్, అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్సులు, ఇంటెన్స్ యాక్షన్స్, అన్ ఎక్స్ పెక్టెడ్ ట్విస్టులతో అద్భుతంగా రూపొందుతోంది ఆల్ఫా.
ఇంకా చదవండి: ఎంత ఊహించుకుని వచ్చినా అంతకు మించి ఉంటుంది.. ‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!