అల్లు అర్జున్ 'పుష్ప-2' డిసెంబర్ 5న విడుదల
1 month ago | 5 Views
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ’పుష్ప ది రూల్’. 'పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్స్ విూడియా ముందుకు వచ్చారు. సినిమా చిత్రీకరణకు సంబంధించిన విషయాలతోపాటు, రిలీజ్ డేట్ గురించి మాట్లాడారు. అభిమానుల కోరిక మేరకు అనుకున్న డేట్ డిసెంబర్ 6 కంటే ఒక రోజు ముందే డిసెంబర్ 5న దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుకుమార్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ;పుష్ప ది రైజ్’ తెరకెక్కింది. రష్మిక కథానాయిక. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది. ఎన్నో అంచనాల మధ్య 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప’ తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో 'పుష్ప ది రైజ్’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో 'పుష్ప ది రూల్’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా చిత్ర నిర్మాణం పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఇంకా చదవండి: హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా ట్రైలర్ రిలీజ్, యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్