అల్లరి నరేశ్ కొత్త సినిమా ప్రారంభం!
4 months ago | 50 Views
వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించే అల్లరి నరేశ్ తాజా సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెహర్ తేజ్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలుకానున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'విూరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అనే క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. నరేశ్ 63వ చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇది రానుంది.
ఇంకా చదవండి: బోనాల కానుకగా 'మిస్టర్ బచ్చన్' టీజర్ విడుదల
# AN63 # AllariNaresh # RuhaniSharma