'బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్‌!

'బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్‌!

3 days ago | 7 Views

ఇటీవలే ’ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్‌. ఇప్పుడు ’బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. రావు రమేశ్‌, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  అల్లరి నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో నరేశ్‌ మాస్‌ రగ్గడ్‌ లుక్‌లో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. ఇంటి ముందు భగవద్గీత వినిపిస్తున్న మైక్‌ సెట్‌ను విసిరికొట్టడం.. బార్‌లో శత్రువులపై విరుచుకుపడిన తీరు..

ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత మాస్‌గా కనిపించనుందో తెలియజేస్తున్నాయి. ‘ఏయ్‌ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి‘ అంటూ ఆఖర్లో నరేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తన నుంచి ఓ కొత్త కబురు వినిపించింది. ’ఫ్యామిలీ డ్రామా’ అనే చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించిన మెహర్‌ తేజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘విూరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు‘ అంటూ చిత్ర నిర్మాతలు విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. దీన్ని బట్టి ఇదొక వైవిధ్యభరితమైన కథతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు దీంట్లో నరేశ్‌ పాత్ర అందర్నీ ఆశ్చర్చపరిచే విధంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇంకా చదవండి: "కల్కి' చిత్రానికి ఆదరణపై నాగ్‌ అశ్విన్ ధన్యవాదాలు.. అరుదైన మూవీ అంటూ వీడియో విడుదల!

# BachhalaMalli     # AllariNaresh     # Subbu     # TeluguCinema