ఇంకా చూడని వాళ్లంతా కూడా చూడండి ఓటీటీ లో.. అందరికీ నచ్చుతుంది.. ‘బహిష్కరణ’ సక్సెస్ మీట్‌లో అంజలి

ఇంకా చూడని వాళ్లంతా కూడా చూడండి ఓటీటీ లో.. అందరికీ నచ్చుతుంది.. ‘బహిష్కరణ’ సక్సెస్ మీట్‌లో అంజలి

4 months ago | 68 Views

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి తాజాగా ‘బహిష్కరణ’ అంటూ వచ్చారు. ZEE5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


అంజలి మాట్లాడుతూ.. ‘ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే క్రమంలోనే పుష్ప అనే పాత్రను ఎంచుకున్నాను. ఈ కారెక్టర్ నాతో ఏడాదిన్నరకు పైగా ట్రావెల్ చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలి పెట్టలేను. పుష్ప ఆడియెన్స్ అందరికీ నచ్చింది. నటిగా నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఇలాంటి పాత్రలు రాయడం గొప్ప. బహిష్కరణను ఇంత గొప్పగా రాసిన ముఖేష్ గారికి థాంక్స్. ప్రసన్న విజువల్స్ గురించి అందరూ చెబుతున్నారు. సిద్దార్థ్ ఆర్ఆర్ అదిరిపోయింది. రవీంద్ర విజయ్ వంటి ఆర్టిస్ట్‌తో పని చేయడం కిక్కిస్తుంది. శివయ్య పాత్రను రవీంద్ర తప్పా ఇంకెవ్వరూ ఇంత బాగా పోషించలేరు. దర్శిగా శ్రీతేజ్ బాగా నటించారు. నిర్మాత ప్రశాంతి సహకారం లేకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. ఇంత మందికి మా చిత్రం రీచ్ అయిందంటే దానికి కారణం ZEE 5. ప్రాజెక్ట్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా వెబ్ సిరీస్‌ను చూడని వాళ్లంతా కూడా చూడండి.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.  

ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘ZEE5, ప్రశాంతి గారి వల్లే నా ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. అంజలి గారికి ఇది గేమ్ చేంజర్. ఆమె ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె రూపంలో నాకు ఒక మంచి స్నేహితురాలు దొరికారు. రవీంద్ర గారు శివయ్య పాత్రకు న్యాయం చేశారు. ప్రసన్న విజువల్స్ అద్బుతంగా వచ్చాయి. సిద్దార్థ్ ఆర్ఆర్ బాగుంది. మా వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

శ్రీతేజ్ మాట్లాడుతూ.. ‘మా వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మీడియా నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఎమోషనల్‌గా సాగే ఈ బహిష్కరణ ది బెస్ట్ వెబ్ సిరీస్‌గా మారుతుంది. ముఖేష్ వల్లే ఈ వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అవుతోంది. బహిష్కరణతో కెరీర్ టర్న్ అవుద్దని ముఖేష్ గారు మొదటే చెప్పారు. అంజలి గారు విలక్షణ నటి. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు పుష్ప పాత్రే హైలెట్. ప్రశాంతి గారికి ఇది మొదటి ప్రాజెక్ట్. నిర్మాతగా ఎన్ని సవాళ్లు ఎదురైనా నిలబడ్డారు. రైటర్ వంశీ గారు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సిద్దార్థ్ గారి మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చూడని వాళ్లంతా మా వెబ్ సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.

సిద్దార్థ్ సదాశివుని మాట్లాడుతూ.. ‘ముఖేష్‌తో ఈ ప్రాజెక్ట్ కోసం ఐడియా నుంచే ప్రయాణం చేశాను. ఇందులో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. పాత్రలను రాసుకుంటున్న టైంలోనే ఆర్టిస్టుల పేర్లు కూడా చెబుతుండేవాడు.  పుష్పగా అంజలి, దర్శిగా శ్రీతేజ్ అద్భుతంగా నటించారు. ప్రతీ కారెక్టర్‌కు ఓ థీమ్ మ్యూజిక్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌కు ఇంత మంచి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అంజలి, శ్రీతేజ్, బాషా, అనన్యలతో పని చేయడం ఆనందంగా ఉంది. కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా అవుట్ పుట్, రెస్పాన్స్ అదిరిపోయింది. అందరూ ఈ వెబ్ సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.

ఇంకా చదవండి: ఆగస్ట్ 2న ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీ రిలీజ్

# Bahishkarana     # Anjali     # Nagarjuna     # TeluguCinema    

trending

View More