అక్షయ్ 'ఖేల్‌ఖేల్‌మే' ట్రైలర్ విడుదల!
4 months ago | 40 Views
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ’ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ , ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అవ్మిూ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తే.. తమిళంలో హిట్ అయిన లవ్ టూడే సినిమా స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్ అంతా ఫ్రెండ్స్. ఒక పార్టీలో వీళ్లందరు కలుసుకోని ఒక గేమ్ ఆడదాం అనుకుంటారు. ఇంతకీ ఆ గేమ్ ఏంటి అంటే.. అందరు తమ ఫోన్స్ అన్ లాక్ చేసి చూపించాలి. అయితే ఆ ఫోన్స్‌లో ఏం ఉంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం జనరేషన్‌లో మొబైల్స్‌కి అలవాటు పడిన జనాలు ఏం చేస్తున్నారు. ఏం చూస్తున్నారు అనే స్టోరీతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం 2016 ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ’పర్ఫెక్ట్ స్టేంª`రజర్స్ కి రీమేక్.
ఇంకా చదవండి: కొత్త అనుభూతిని కలిగించే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం!
# KhelKhelMein # AkshayKumar # TaapseePannu