అక్షయ్ కుమార్ ’ఖేల్ ఖేల్ మే’
5 months ago | 47 Views
ఒకవైపు వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటూనే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ’ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తుండగా.. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను, వాణి కపూర్, అవ్మిూ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది.
ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ’హలో’ చెప్పండి! అంటూ పోస్టర్ కింద రాసుకోచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మూడు జంటల నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అని తెలుస్తుంది. ఈ చిత్రం 2016 ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ’పర్ఫెక్ట్ స్టేర్రజర్స్ కి రీమేక్. అయితే ఇండిపెండెన్స్ బరిలో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కలిపి ఐదు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో మూడు బడా సినిమాలో ఉండగా ఈ లీస్ట్‌లో అక్షయ్ కుమార్ సినిమాలో నాలుగుకు చేరింది. తెలుగు నుంచి రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్ వస్తుండగా.. కోలీవుడ్ నుంచి విక్రమ్ తంగలాన్, బాలీవుడ్ నుంచి స్త్రీ రాబోతున్నాయి. ఇక తాజాగా ’ఖేల్ ఖేల్ మే' వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ రానుంది.
ఇంకా చదవండి: యాక్షన్ సినిమాల్లో 'కిల్' ప్రత్యేకం!
# KhelKhelMein # AkshayKumar # TaapseePannu # TeluguCinema # August15