టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అక్షయ్ కుమార్

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అక్షయ్ కుమార్

2 months ago | 28 Views

మంచు విష్ణు కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న సినిమా 'కన్నప్ప'. కన్నప్ప జీవితంపై సినిమా చేయాలనేది అతని తండ్రి, మోహన్ బాబు కల, చివరకు అది ఇప్పుడు జరుగుతోంది, మరియు ఇందులో విష్ణు మంచు స్వయంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాదాపు ఈ చిత్రం 50% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇందులో శివుని పాత్రగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తెలిసింది. 

శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ 

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, అక్షయ్ కుమార్ తో దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు అంట. ఈరోజు, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అక్షయ్ కుమార్ మోహన్‌బాబుని కలిసినట్లు చూపించే చిన్న వీడియో విడుదలైంది. విష్ణు మంచు కొన్ని వారాల క్రితం అక్షయ్ కుమార్‌ని కలుసుకుని తన పాత్రని వివరించాడు అంట. అయితే అక్షయ్ కుమార్ ఆ పాత్రను ఇష్టపడి వెంటనే అంగీకరించాడు. కన్నప్ప చిత్రం, అక్షయ్ కుమార్ కి మొదటి తెలుగు సినిమా కాబోతుంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 2.0తో తమిళంలోకి అడుగుపెట్టిన అక్షయ్ కుమార్ ఇప్పుడు తెలుగు చిత్రంలోకి రానున్నారు.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు ప్రభాస్ కూడా నటించనున్నారు. తాజా  వార్త ప్రకారం, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తారని, ఆయన తన పాత్ర కోసం ఏడు రోజుల డేట్స్ కూడా ఇచ్చారని తెలిసింది. మంచు విష్ణు ఈ భారి బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా అతిధి పాత్రలో కనిపిస్తారని సమాచారం వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. షూటింగ్‌లో కొంత భాగం న్యూజిలాండ్‌లో జరిగింది మరియు మిగిలినది సెట్స్‌లో చిత్రీకరించబడుతుంది. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, షెల్డన్ చౌ కెమరామెన్ గ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఓ ప్రముఖ తమిళ స్టార్ అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వేచి చూద్దాం.

ఇంకా చదవండి: తెలుగు సినిమాలో మొదటి సారి - లక్ష్మీకటాక్షం నుండి మొదటి డైలాగ్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదల

# Kannappa     # VishnuManchu     # Prabhas     # AkshayKumar