అక్షయ్ కుమార్ ..'ఖేల్‌ఖేల్‌మే..'
5 months ago | 50 Views
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే సర్ఫీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్' సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అక్షయ్‌కుమార్, వాణీకపూర్ కాంబినేషన్‌లో వచ్చే ఈ పాట ఫీల్ గుడ్ ఇంప్రెషన్‌తో సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని విజువల్స్ చెబుతున్నాయి. ముదస్సార్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఖేల్ ఖేల్ మే మూవీలో తాప్సీ పన్ను, వాణీ కపూర్, ప్రగ్యాజైశ్వాల్, ఫర్దీన్ ఖాన్, అవ్మిూ విర్క్, ఆదిత్యా సీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని టీ సిరీస్ వకూ ఫిలిమ్స్, కేకేఎం ఫిలిం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇంకా చదవండి: ఘనంగా వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆగస్టు 2న తగ్గించిన టికెట్ రేట్లతో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
# KhelKhelMein # AkshayKumar # TaapseePannu # VaaniKapoor