ఆహాలో చాందిని చౌదరి 'యేవమ్' రిలీజ్.. నేటి నుంచి స్ట్రీమింగ్
5 months ago | 62 Views
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. జూన్ 14న థియేటర్లలో విడుదలై ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన నవ్యమైన చిత్రంగా అభినందనలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి అనగా నేటి నుంచిఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారు.
కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో మహిళల గొప్పదనం, మహిళా సాధికారిత అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు డీల్ చేశాడు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కారు. వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు అనేది ఈ చిత్రంలో చూపించారు. మిస్టరీగా వున్న ఓ కేసును ఓ మహిళా పోలీసు అధికారి ఎలా పరిష్కరించారు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓటీటీలో వీక్షించాల్సిందిగా కోరుతున్నారు మేకర్స్.
ఇంకా చదవండి: రాజు యాదవ్: aha ott లో స్ట్రీమింగ్.
# Yevam # VasishtaSimha # ChandiniChowdary # TeluguCinema