చాలాకాలం తరవాత సలోని సందడి.. 'మట్కా'తో కమ్‌ బ్యాక్‌!

చాలాకాలం తరవాత సలోని సందడి.. 'మట్కా'తో కమ్‌ బ్యాక్‌!

1 month ago | 5 Views

'రాయే రాయే రాయే రాయే రాయే సలోని.. జాము రాతిరేలా సందుచూసి జంప్‌ జిలాని' అంటూ కుర్రకారుని ఉర్రుతలు ఊగించిన టాలీవుడ్‌ భామ సలోనీ చాలా రోజులకు తెరపై కనిపించబోతుంది.  ఆమె కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నుంచి తాజాగా సలోని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో సలోని పద్మ అనే పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'పలాస 1978' సినిమా ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


విూనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వైజాగ్‌ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వరుణ్‌ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. నవీన్‌ చంద్ర, కిశోర్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: బాధల్లో మేముంటే..విూకు రీల్సా ? : సోషల్‌ విూడియా వేదికగా కిచ్చా సుదీప్‌ కూతరు కామెంట్స్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# మట్కా     # వరుణ్ తేజ్     # నోరా ఫతేహి     # మీనాక్షి చౌదరి    

trending

View More