8 ఏళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు ఉపేంద్ర..

8 ఏళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు ఉపేంద్ర..

1 day ago | 5 Views

కన్నడ రియల్‌ స్టార్‌ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం'UI ది మూవీ' .   దాదాపు 8 ఏండ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర. మనోహరన్‌- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న  సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. 'కాంతర' ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి వార్నర్‌ పేరిటా టీజర్‌ను పంచుకున్నారు మేకర్స్‌.


ఈ టీజర్‌ చూస్తుంటే.. అనే ఫిక్షనల్‌ వరల్డ్‌లో ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌, ఏఐ, కరోనా, ఆర్థిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధాలతో ముగిసిన అనంతరం 2040లో భూమి ఎలా ఉండబోతుంది.. ప్రజలు ఎలా జీవిస్తున్నారు. భూమిని కాపిటలిస్ట్‌లు లాక్కోని ఎలా నాశనం చేశారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వరల్డ్‌లో ఉపేంద్ర పవర్‌ఫుల్‌ రోల్‌గా కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాను డిసెంబర్‌ 20 న తెలుగుతో పాటు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఇంకా చదవండి: ‘క‌న్న‌ప్ప’ మూవీలో మోహ‌న్ బాబు మనవరాళ్లు.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# UI ది మూవీ     # ఉపేంద్ర