'ట్రిపుల్ ఆర్‌' డాక్యుమెంటరీకి అడ్వాన్స్‌ ఒపెన్‌

'ట్రిపుల్ ఆర్‌' డాక్యుమెంటరీకి అడ్వాన్స్‌ ఒపెన్‌

5 hours ago | 5 Views

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా మేకింగ్‌ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’అంటూ రాబోతున్న ఈ డాక్యుమెంటరీ డిసెంబర్‌ 20న నేరుగా ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. మంచి వ్యూస్‌ దక్కించుకుంది. అయితే రేపు ఈ డాక్యుమెంటరీ విడుదల కానుండగా.. బుక్‌ మై షోలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. వీటి టికెట్‌ ధరలు చూసుకుంటే.. రూ.200 నుంచి రూ.300 వరకూ ఉన్నాయి. మరోవైపు ఈ డాక్యుమెంటరీ రన్‌ టైం 1 గంట 38 నిమిషాలు ఉంది.

ఇంకా చదవండి: క్రిష్‌తోపాటే నేను బయటకు వచ్చా : డైలాగ్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రాజమౌళి     # RRR    

trending

View More