'యుఫోరియా'లో భూమిక కీలక పాత్ర!

'యుఫోరియా'లో భూమిక కీలక పాత్ర!

6 months ago | 5 Views

టాలీవుడ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ కాంపౌండ్‌ నుంచి కొత్త సినిమా వస్తుందని తెలిసిందే. 'యుఫోరియా'  టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షార్ట్‌ టైటిల్‌ వీడియో ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. హోం బ్యానర్‌ గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి చాలా కాలానికి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. మళ్లీ 2 దశాబ్దాల తర్వాత కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుంది.


ఒక్కడు డైరెక్టర్‌ గుణ్‌ శేఖర్‌, హీరోయిన్‌ భూమిక మరోసారి ఈ సినిమాకు కలిసి పనిచేస్తున్నారు. 'యుఫోరియా'లో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ పరోక్షంగా ఈ విషయంపై హింట్‌ ఇచ్చేసిందని తెలుస్తుండగా.. భూమిక ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది సస్పెన్స్‌ నెలకొంది. భూమిక చివరగా అనుపమ్‌ పరమేశ్వరన్‌ లీడ్‌ రోల్‌ పోషించిన సినిమాలో నటించింది. గుణశేఖర్‌ ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని సరికొత్త కథాంశంతో యూత్‌ ఫుల్‌ సోషల్‌ డ్రామాగా సమకాలీన సామాజిక సమస్యల నేపథ్యంలో యుఫోరియా తెరకెక్కిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

ఇంకా చదవండి: 25న వస్తున్న 'పొట్టేల్‌' మూవీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# Euphoria     # Bhumika     # Vignesh