'రోలెక్స్‌' పాత్ర ఆధారంగా సినిమా : హీరో సూర్య ఆసక్తికర విషయం వెల్లడి

'రోలెక్స్‌' పాత్ర ఆధారంగా సినిమా : హీరో సూర్య ఆసక్తికర విషయం వెల్లడి

2 months ago | 5 Views

కమల్‌ హాసన్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం 'విక్రమ్‌’ లో సూర్య  పోషించిన 'రోలెక్స్‌’పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  మాదకద్రవ్యాల గ్యాంగ్‌లీడర్‌గా సినిమా  క్లయిమాక్స్ ఆయన పండించిన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రోలెక్స్‌ పాత్రను ఆధారంగా చేసుకొని ఒక పూర్తిస్థాయి సినిమాను తెరకెక్కిస్తానని లోకేశ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 'కంగువా’  ప్రమోషన్స్‌లో 'రోలెక్స్‌’ సినిమా  గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  గతంలో తాను నటించిన ఓ సినిమాతో దీనికి సంబంధం ఉంటుందన్నారు. '1986లో విడుదలైన 'విక్రమ్‌’తో 2022లో వచ్చిన 'విక్రమ్‌’కు ఏవిధంగా లింక్‌ ఉందో అదేవిధంగా 'రోలెక్స్‌’కూ నేను నటించిన ఒక సినిమాతో కనెక్షన్‌ ఉంటుంది‘ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ సినిమా  ఏమై ఉంటుందా? అని 'ఎక్స్‌’ వేదికగా పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సూర్య నటించిన తాజా చిత్రం 'కంగువా’. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ డియోల్  కీలకపాత్ర పోషించారు. పీరియాడిక్‌ యాక్షన్‌ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్‌లో దీనిని చిత్రీకరించినట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.  నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దాదాపు రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు సూర్య. సినిమా విశేషాలు, కొత్త ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడించారు.  ఇందులో భాగంగానే 'రోలెక్స్‌’ గురించి మాట్లాడారు. లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం 'కూలీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్‌ హీరోగా ఇది తెరకెక్కుతోంది.

ఈ సినిమా తర్వాత తాను ఎల్‌సీయూ హీరోలందరితో కలిసి అదిరిపోయే సినిమా  చేయాలనుకుంటున్నానని ఇటీవల చెప్పారు. 'విక్రమ్‌’ని అద్భుతంగా పూర్తి చేసేందుకు 'రోలెక్స్‌’ సీన్స్‌ క్రియేట్‌ చేశా. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌ దృష్టిలోఉంచుకొని 'రోలెక్స్‌’పై ఒక స్టాండలోన్‌ మూవీ చేయాలను కుంటున్నా. 'కూలీ’ పూర్తి చేసిన తర్వాత, హీరోలందరితో పీక్‌ ఎల్‌సీయూ మూవీ చేయనున్నా అని తెలిపారు.

ఇంకా చదవండి: అక్టోబర్ 25న రాబోతోన్న ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Vikram     # KamalHaasan     # Suriya    

trending

View More