'ఎమర్జెన్సీ'కి లైన్‌ క్లీయర్‌ అయ్యే చాన్స్‌..  సున్నిత అంశాలు తొలగించాలని సూచన!

'ఎమర్జెన్సీ'కి లైన్‌ క్లీయర్‌ అయ్యే చాన్స్‌.. సున్నిత అంశాలు తొలగించాలని సూచన!

11 hours ago | 5 Views

కంగనా రనౌత్‌ నటించిన 'ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యేలా కనిపిస్తోంది.  చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్‌ బోర్డ్‌ విడుదలకు అనుమతిని నిరాకరించింది. దీంతో కంగన టీమ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో సెప్టెంబర్‌ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సినిమాలో కొంత సున్నితమైన కంటెంట్‌ ఉందని.. వాటిని తొలగిస్తే సర్టిఫికెట్‌ ఇస్తామని సెన్సార్‌ బోర్డు కోర్టుకు తెలియజేసింది. దీంతో నిర్మాణ సంస్థ సెన్సార్‌ బోర్డు సూచనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 30కి వాయిదా వేసింది. ఈలోగా నిర్ణయం తీసుకోవాలని నిర్మాణ సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో 'ఎమర్జెన్సీ’ విడుదలకు త్వరలో చిక్కులు తొలుగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకా చదవండి: 'సత్యంసుదందరం' విజయాన్ని అందుకోవాలి... చిత్రం విడుదల సందర్భంగా సాయిదుర్గా తేజ్‌ పోస్ట్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Emergency     # KanganaRanaut     # Bollywood