ఖోఖో నేపథ్యంలో మళయాల సినిమా

ఖోఖో నేపథ్యంలో మళయాల సినిమా

4 months ago | 40 Views

సినిమా ప్రియులను అలరించేందుకు కాస్త గ్యాప్‌ తర్వాత ఓ డబ్బింగ్‌ మలయాళస్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ఖో ఖో డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 2021లో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌తో హిట్‌ చిత్రంగా నిలవడమే కాక, టీవీలో టెలికాస్ట్‌ అయి అత్యధిక టీఆర్పీ సాధించిన టాప్‌ 5 మలయాళ సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. రాహుల్‌ రిజి నాయర్‌ రచనతో పాటు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీషా విజయన్‌, మమితా బైజు  కీలక పాత్రలు పోషించారు. కత విషయానికి వస్తే.. కేరళలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ మహిళల స్కూల్‌లో పీఈటీగా జాయిన్‌ అవుతుంది మరియా ఫ్రాన్సిస్‌. ఈ క్రమంలో ఆమె అక్కడి పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఓ ఖో ఖో టీమ్‌ను తయారు చేస్తుంది.

ఈ నేపథ్యంలో మరియాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, పిల్లలు టీచర్‌కు సహకరించారా, మధ్యలో టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఏం జరిగిందనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా ఇంటిల్లిపాదిని అలరిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీ విన్‌ ఓటీటీలో తెలుగులో మన ముందుకు వచ్చింది. ఎక్కడా ఎలాంటి అసభ్యత, వల్గారిటీ లేకుండా రూపొందించిన ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం హాయిగా చూసి అస్వాదించవచ్చు.  చిత్రంలో ఖోఖో ప్లేయర్స్‌గా నటించిన వాల్లంతా రియల్‌ లైఫ్‌లోనూ ఖోఖో ప్లేయర్స్‌ కావడం గమనార్హం.

ఇంకా చదవండి: నారా రోహిత్‌ 'సుందరకాండ'!


# Kho-Kho     # MamithaBaiju     # RajishaVijayan    

trending

View More