'35' చిన్న కథ కాదు.. గ్లింప్స్‌ వచ్చేసింది!

'35' చిన్న కథ కాదు.. గ్లింప్స్‌ వచ్చేసింది!

1 month ago | 26 Views

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్‌ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌  '35' చిన్న కథ కాదు..  రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్దార్థ్‌ రాళ్లపల్లి  నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్‌ ఈమాని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి మొండి గురువు ఓ. చాణక్య వర్మకి సంబంధించిన 35 సెకెన్ల గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్‌.


ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గణిత ఉపాధ్యాయుడి పాత్రలో దర్శి కనిపిస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఆయన మొండితనం, క్రమ శిక్షణలో చూపెట్టే నేర్పరితనం ఈ గ్లింప్స్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచాయి. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్‌ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో కనీసం పాస్‌ మార్కులు రానందుకు తండ్రి మందలించగా..కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. అతడి కోసం తల్లి ఆరాటపడడం తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేసింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: వచ్చే నెల పట్టాలకెక్కనున్న ఎన్టీఆర్‌ కొత్త సినిమా

# 35ChinnaKathaKaadu     # NivethaThomas     # Priyadarshi     # August15    

trending

View More