300 కోట్లు దాటిన 'సంక్రాంతికి వస్తున్నాం'

300 కోట్లు దాటిన 'సంక్రాంతికి వస్తున్నాం'

3 days ago | 5 Views

విక్టరీ వెంకటేష్‌ నటించిన సినిమాలు ప్రేక్షకులకి ఏ మాత్రం బోర్‌ కొట్టించవు. సూపర్‌ హిట్‌ కాకపోయిన మినిమం ఆడతాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్‌ హిట్‌ అయింది. థియేటర్లలో రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.రీసెంట్‌గా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి కావడంతో ఈ మైలురాయి తమ ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అచంచలమైన అంకితభావంతో సాధ్యమైందని, వారు సినిమాను అన్ని మూలలకు చేరేలా చూశారంటూ దర్శకుడు అనీల్‌ రావిపూడి ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఇంత మంచి హిట్‌ తర్వాత వెంకటేష్‌ కథల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడట. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ప్రేక్షకులకి మరింత వినోదం పంచేలా సినిమా చేయాలని అనుకుంటున్నాడట.


'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్‌ తర్వాత వెంకటేష్‌ దాదాపుగా 25కు పైగా కథలు విన్నాడని టాక్‌. అయితే వాటిలో వెంకీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు అని టాక్‌ . ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్‌ అయిన కూడా వెంకటేష్‌ మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడట. అందుకు కారణం గత అనుభవాలే మరి. వెంకటేష్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాల తర్వాత శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో సైంధవ్‌ అనే యాక్షన్‌ సినిమా చేశాడు. ఆ మూవీ పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్న వెంకటేష్‌ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడట.

ఇంకా చదవండి: డైరెక్టర్‌ అట్లీకుమార్‌తో బన్నీ సినిమా ప్లాన్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సంక్రాంతికి వస్తున్నాం     # వెంకటేష్ దగ్గుబాటి     # మీనాక్షి చౌదరి    

trending

View More